Pavan Kalyan: 'బ్రో' ప్రీ రిలీజ్ ఈవెంటులో మెరిసిన ముగ్గురు భామలు!

- కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన 'బ్రో'
- శిల్పకళావేదికలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- స్టేజ్ పై అందంగా మెరిసిన ఊర్వశి రౌతేలా
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మెగా హీరోలు
- ఈ నెల 28వ తేదీన సినిమా విడుదల
పవన్ కల్యాణ్ - సాయితేజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'బ్రో' ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - 'శిల్పకళావేదిక'లో నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించిన ప్రియా ప్రకాశ్ వారియర్ .. కేతిక శర్మతో పాటు, ఐటమ్ సాంగ్ చేసిన ఊర్వశి రౌతేలా కూడా ఈ వేదికపై అందంగా మెరిసింది.

