India: జమ్ము కశ్మీర్‌లో చిన్నారులను లక్ష్యంగా చేసుకుంటున్న పాకిస్తాన్ నిఘా వర్గాలు

Pak Intel Operatives Target Students In Jammu To Seek Sensitive Information

  • ఆయుధాలు, సందేశాల చేరవేతకు స్కూల్ విద్యార్థులను వినియోగిస్తున్న ఉగ్రసంస్థలు
  • ఐఎస్ఐ నుండి కాల్స్, వాట్సాప్ సందేశాలు
  • ఉపాధ్యాయులుగా నటిస్తూ విద్యార్థులను లక్ష్యంగా కుట్ర

జమ్ము కశ్మీర్ లో ఆయుధాలు, సందేశాల చేరవేతకు పాకిస్థాన్ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలు ఇక్కడి ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ సహా చాలామంది విద్యార్థులను వినియోగిస్తున్నట్లుగా వెలుగు చూసింది. ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ సహా పలువురు విద్యార్థులకు పాకిస్థాన్ నిఘా వర్గాల (ఐఎస్ఐ) నుండి కాల్స్, వాట్సాప్ మెసేజ్ లు వస్తున్నాయని, ప్రత్యేక సోషల్ మీడియా గ్రూపులలో చేరాలని, సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలని చెబుతున్నారని ఆర్మీ వర్గాలు గుర్తించినట్లుగా తెలిపాయి. విద్యార్థులకు ముఖ్యంగా 8617321715, 9622262167 అనే రెండు మొబైల్ ఫోన్ నెంబర్ల ద్వారా పీఐఓల నుండి కాల్స్, కాల్‌లు, వాట్సాప్ సందేశాలు వస్తున్నట్లు తెలిపారు. భారత సైనిక వర్గాలూ ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.

పాకిస్థాన్ నిఘా వర్గాలకు చెందిన వ్యక్తులు ఉపాధ్యాయులుగా నటిస్తూ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఈ క్రమంలో పిల్లలకు అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఫోన్లు చేయడంతో పాటు వాట్సాప్ లో సందేశాలు పెడుతున్నారని, వాట్సాప్ లో క్లాస్ రూంకు సంబంధించిన గ్రూపులను పేర్కొంటూ వాటిలో చేరాలని సూచిస్తున్నారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఓటీపీలు పంపిస్తున్నారని, ఒక్కసారి గ్రూప్ లో చేరిన తర్వాత సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలని అడుగుతున్నట్లు తెలిపారు.

ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ జారీ చేసిన ఒక అడ్వైజరీ ప్రకారం.. పీఐవోలు విద్యార్థులను వారి తండ్రి ఉద్యోగం, పాఠశాల దినచర్య, సమయాలు, ఉపాధ్యాయుల పేర్లు, యూనిఫాం మొదలైన వివరాలను అడుగుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు ఉపాధ్యాయులు... ఈ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. అనుమానాస్పద కాల్స్ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

  • Loading...

More Telugu News