YS Jagan: జగన్‌కు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో చుక్కెదురు

Shock to YS jagan in Kodi Kathi case

  • కుట్రకోణంపై లోతుగా దర్యాఫ్తు చేయాలన్న పిటిషన్ ను కొట్టివేసిన న్యాయస్థానం
  • వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరిన పిటిషన్‌ను 1న విచారిస్తామని వెల్లడి
  • నిందితుడు వేసిన పిటిషన్ పైనా విచారణ వాయిదా

తనపై విశాఖలో జరిగిన దాడి కేసులో కుట్రకోణంపై మరింత లోతుగా దర్యాఫ్తు చేయాలని వైఎస్ జగన్ తరఫు లాయర్ దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ ఎన్ఐఏ న్యాయస్థానం కొట్టివేసింది. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ జగన్ వేసిన పిటిషన్‌పై ఆగస్ట్ 1న విచారణ జరుపుతామని తెలిపింది. అదే సమయంలో నిందితుడు నాలుగేళ్లుగా జైల్లో ఉన్నాడని, బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా అదే రోజు విచారిస్తామని తెలిపింది.

ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ రాజమహేంద్రవరం జైల్లో ఉన్నాడని, విజయవాడ ఎన్ఐఏ కోర్టులో రెగ్యులర్ విచారణకు ఇబ్బందిగా మారిందని నిందితుడి తరఫు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై న్యాయమూర్తి వివరణ అడిగారు. దానికి జైలు సూపరింటెండెంట్ స్పందిస్తూ.. ఇక్కడి జైలులో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఎన్ఐఏ కేసులో రిమాండ్‌లో ఉన్న ఖైదీకి జైలు నుండి విచారణ సాధ్యం కాదని కోర్టు దృష్టికి తెచ్చారు.

  • Loading...

More Telugu News