Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనుచరుడు, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ ఇంట్లో నాటుబాంబులు

Bombs found in YSRCP leader Madhu house

  • పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో మధు ఇంటిపై ఉన్న ట్యాంకులో బాంబులు
  • ట్యాంక్ క్లీన్ చేస్తుండగా కనిపించిన బాంబులు
  • వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన మధు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాటు బాంబులు మరోసారి కలకలం రేపాయి. శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనుచరుడు, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ బోయ మధు ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంకులో 20 నాటుబాంబులు లభ్యమయ్యాయి. పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్ లో రెండు కవర్లలో ఈ బాంబులను గుర్తించారు. ట్యాంక్ ను క్లీన్ చేస్తుండగా ఇవి బయటపడ్డాయి. విషయం తెలిసిన వెంటనే మధు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు... బాంబులను ఎవరు అక్కడ ఉంచారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Byreddy Siddharth Reddy
Boya Madhu
YSRCP
Natu Bombs
  • Loading...

More Telugu News