Pawan Kalyan: 'బ్రో' సెట్స్ పై పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

Pawan Kalyan on BRO sets

  • పవన్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో బ్రో
  • జులై 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం
  • ముగింపు దశలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు

మామాఅల్లుళ్లు పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్రో' చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల సందడి కొనసాగుతోంది. ఇటీవల వరుసగా పాటలు వదులుతున్న 'బ్రో' చిత్రబృందం తాజాగా 'బ్రో' థీమ్ సాంగ్ ను కూడా రిలీజ్ చేసింది. 

కాగా ఈ చిత్ర నిర్మాత వివేక్ కూచిభొట్ల 'బ్రో' చిత్రీకరణకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను పంచుకున్నారు. ఇందులో పవన్ కల్యాణ్, వివేక్ కూచిభొట్ల, దర్శకుడు సముద్రఖని, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారు. 

'బ్రో' చిత్రం జులై 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు నటించారు.

Pawan Kalyan
BRO
Vivek Kuchibhotla
Sai Dharam Tej
Samuthirakani
Trivikram Srinivas
People Media Factory
  • Loading...

More Telugu News