Prabhas: ప్రభాస్ 'కల్కి' రిలీజ్ డేట్ వాయిదా? ఆ సెంటిమెంట్ కారణమనే టాక్!

Kalki Movie Update

  • ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'కల్కి'
  • 600 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా 
  • వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ ఉండకపోవచ్చని టాక్ 
  • మే 9వ తేదీకి వాయిదా వేయనున్నారని ప్రచారం  

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 A.D' రూపొందుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తున్న ఈ సినిమాలో, అమితాబ్ .. కమల్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. 

ముందుగా ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. అయితే ఇప్పుడు ఆ తేదీన ఈ సినిమా థియేటర్లకు రాకపోవచ్చనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. మరో నాలుగు నెలల ఆలస్యంగా, అంటే మే నెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారని అంటున్నారు. మే 9వ తేదీని ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. 

అయితే ఇలా రిలీజ్ డేట్ ను వాయిదా వేయడానికి గల కారణం, ముందుగా అనుకున్న సమయానికి పనులు కాకపోవడం కారణం కాదు .. వైజయంతీ వారికి ఉన్న సెంటిమెంట్ కారణమనే టాక్ వినిపిస్తోంది. గతంలో ఈ బ్యానర్లో మే 9వ తేదీన విడుదలైన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' .. 'మహానటి' సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు 'కల్కి'ని అక్కడికి జరుపుకుతున్నారనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. 

Prabhas
Deepika Padukone
Amitabh Bachchan
Kamal Haasan
  • Loading...

More Telugu News