: ఎమ్మార్ ఎంజీఎఫ్ కు 8,600 కోట్లు జరిమానా
విదేశీ మారక ద్రవ్య నిబంధనలు ఉల్లంఘించినందుకు స్థిరాస్తి సంస్థ ఎమ్మార్ ఎంజీఎఫ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఎమ్మార్ ఎంజీఎఫ్ సంస్థకు 8,600 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఎమ్మార్ఎఫ్ దేశవ్యాప్తంగా చేపట్టిన నిర్మాణాలలో ఫారెక్స్ నిబంధనలు ఉల్లంఘించిందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో తేలింది. ఈ నిబంధనల ఉల్లంఘన హైదరాబాద్ లో 73 కోట్ల వరకూ ఉందని తేలిందని నివేదికలో పేర్కొంది. దీంతో ఈడీ నోటీసులు జారీ చేసింది. మరో వైపు నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేలితే ఈడీ నేరానికి పాల్పడ్డ మొత్తానికి నాలుగు రెట్లు జరిమానాగా విదిస్తుంది. అయితే ఈడీ నోటీసులను ఎమ్మార్ సంస్థ కోర్టులో సవాలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.