Vaishnavi Chaitanya: 10 రోజుల్లో 'బేబి' రాబట్టిన వసూళ్లు ఇవే!

Baby Movie Update

  • ఈ నెల 14వ తేదీన రిలీజైన 'బేబి'
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు 
  • యూఎస్ లోను తగ్గని జోరు  
  • 10 రోజుల్లో 66.6 కోట్ల వసూళ్లు 
  • 100 కోట్ల దిశగా వెళ్లే అవకాశం

ఇటీవల వచ్చిన ప్రేమకథా చిత్రాలలో ప్రేక్షకులను ఎక్కువగా ప్రభావితం చేసిన సినిమాగా 'బేబి' కనిపిస్తుంది. ఆనంద్ దేవరకొండ .. వైష్ణవి చైతన్య .. విరాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. నిన్నటి ఈ సినిమా 10 రోజులను పూర్తిచేసుకుంది. 

ఈ 10 రోజుల్లో ఈ సినిమా 66.6 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఓ మాదిరి బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమా, ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషం. ఇక యూఎస్ లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబడుతోంది అంటున్నారు. బూతులు లేకపోతే యూఎస్ నుంచి వసూళ్లు మరింత పెరిగేవనే టాక్ కూడా వినిపిస్తోంది.

క్రితం వారం కూడా కొత్తగా వచ్చిన సినిమాల కంటే కూడా 'బేబి' సినిమాకి ఎక్కువ టిక్కెట్లు తెగడం విశేషం. కొత్తగా వచ్చిన సినిమాలు 'బేబి' వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. 'బేబి' ఇదే జోరును కొనసాగిస్తే 100 కోట్ల వరకూ వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

More Telugu News