bro movie: ఓవర్సీస్‌ ప్రింట్స్‌ వెళ్లిపోయాయి ‘బ్రో’

Bro units dispatches Overseas prints

  • బ్రో చిత్రం గురించి తాజా అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్ సమద్రఖని
  • ఈ నెల 28న విడుదల కానున్న పవన్‌–సాయితేజ్‌ సినిమా
  • కథనం, మాటలు అందించిన త్రివిక్రమ్‌

పవన్ కల్యాణ్ - సాయితేజ్ కాంబినేషన్‌లో వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం 'బ్రో'. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. టీజర్, ట్రైలర్‌‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా పవన్‌ ఫ్యాన్స్ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళం హిట్ చిత్రం 'వినోదయా సితం' సినిమాకి ఇది రీమేక్. కేతికా శర్మ హీరోయిన్‌గా నటించింది. అయితే, తెలుగుకు తగ్గట్టుగా కథను దాదాపుగా మార్చేసినట్టు సముద్రఖని తెలిపారు. పైగా, త్రివిక్రమ్‌ స్ర్కీన్ ప్లే, మాటలు అందిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. 

చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టగా.. దర్శకుడు సముద్రఖని తాజాగా ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓవర్సీస్ ప్రింట్లను వివిధ దేశాలకు పంపించినట్లు ట్వీట్‌ చేశారు. సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి ల్యాబ్‌లో దిగిన ఫొటోను షేర్‌‌ చేశారు. పవన్‌ సినిమాలకు విదేశాల్లోనూ మంచి క్రేజ్‌ ఉంటుంది. ఓ రోజు ముందుగానే విడుదలయ్యే యూఎస్‌ మార్కెట్‌లో భారీ ఓపెనింగ్స్‌ వస్తుంటాయి.

bro movie
Pawan Kalyan
Sai Dharam Tej
Tollywood
Trivikram Srinivas
  • Loading...

More Telugu News