Vaishnavi Chaitanya: వైష్ణవికి 'బలగం' నుంచి కూడా ఆఫర్ వెళ్లిందట!

Vaishnavi Special

  • 'బేబి'గా ఆకట్టుకున్న వైష్ణవి చైతన్య
  • ఆ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ ఆమెనే  
  • వరుసగా వచ్చి పడుతున్న అవకాశాలు 
  • ఇంతకుముందు 'బలగం చేయవలసిందట

వైష్ణవి చైతన్య .. నిన్నమొన్నటి వరకూ యూత్ లో కొంతమందికి మాత్రమే తెలిసిన పేరు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మాయిని గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం .. రీసెంటుగా థియేటర్లకు వచ్చిన 'బేబి' సినిమా. సాయిరాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. 

ఈ సినిమాలో హీరోలుగా ఆనంద్ దేవరకొండ .. విరాజ్ నటించినప్పటికీ, నటన పరంగా వైష్ణవి ఎక్కువ మార్కులు కొట్టేసింది. గ్లామర్ పరంగా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ సినిమాలో ఆమె మాట్లాడిన తెలంగాణ యాస, ఆ పాత్రకి మరింత బలాన్ని ఇచ్చింది. దాంతో ఇప్పుడు ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయని వినికిడి. 

ఇక గతంలో ఈ బ్యూటీని 'బలగం' సినిమా కోసం వేణు అడిగాడట. అయితే ఆ సమయంలో బిజీగా ఉండటం వలన చేయలేకపోయింది. ఈ విషయాన్ని వేణు స్వయంగా చెప్పాడు కూడా. ఆ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మొత్తానికి ఏ సినిమా చేసినా ఆమె కెరియర్లో ఫస్టు హిట్ రాసిపెట్టే ఉందన్న మాట. 

More Telugu News