Vijay Antony: 'హత్య' మూవీ మండే టాక్!

Hathya Movie Monday Talk

  • ఈ నెల 21వ తేదీన విడుదలైన 'హత్య'
  • రిలీజ్ కి ముందు కనిపించని బజ్ 
  • కంటెంట్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆడియన్స్
  •  విజయ్ ఆంటోనీ నటనకీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీ దక్కిన మార్కులు  

విజయ్ ఆంటోని సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి .. ఆయన ఎంచుకునే కాన్సెప్టులు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అనే ఒక నమ్మకం ఆడియన్స్ లో ఉంది. అందువలన ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలా ఆసక్తికరంగా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అలా ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'హత్య'. 

బాలాజీ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ ఆంటోనితో పాటు, మీనాక్షి చౌదరి .. రితిక సింగ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. 'బిచ్చగాడు 2' తరువాత పెద్ద గ్యాప్ లేకుండానే బరిలోకి దిగిన సినిమా ఇది. అయితే ఎందుకనో రిలీజ్ కి ముందు ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్ కనిపించలేదు. థియేటర్స్ దగ్గర కూడా జనాలు పలచగానే కనిపించారు. కొన్ని చోట్ల షోస్ కేన్సిల్ అయ్యాయి. 

ఆశించిన స్థాయిలో ఈ సినిమా లేదనే టాక్ రిలీజ్ రోజునే వచ్చింది. ఆ తరువాత కూడా థియేటర్స్ వారు షోస్ తగ్గిస్తూ వచ్చారు. వీకెండ్ తరువాత ఈ సినిమాను గురించి ఎవరూ మాట్లాడుకోని పరిస్థితి కనిపిస్తోంది. అయితే నిజానికి ఈ సినిమా కోసం వాడిన లైటింగ్ .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తాయి. కానీ సగటు ప్రేక్షకుడికి దగ్గరగా ఈ కంటెంట్ వెళ్లలేకపోయింది. విజయ్ ఆంటోని 'బిచ్చగాడు' సీక్వెల్స్ చేసుకోవడమే మంచిదనే అభిప్రాయం థియేటర్స్ దగ్గర వినిపించిన మాట. 

Vijay Antony
Rithika Singh
Meenakshi Chaudary
Hathya Movie
  • Loading...

More Telugu News