Kalvakuntla Himanshu: కల్వకుంట్ల హిమాన్షు కొత్త పాట విడుదల వాయిదా

Kalvakuntla Himanshu postpones his new song release

  • పాశ్చాత్య గీతాలకు హిమాన్షు కవర్ సాంగ్స్
  • గతంలో గోల్డెన్ అవర్ పాటకు అద్భుతమైన పెర్ఫార్మెన్స్
  • సోషల్ మీడియాలో విశేష స్పందన
  • తాజాగా 'ప్రెట్టీ' అనే పాట రూపొందించిన హిమాన్షు

తెలంగాణ సీఎం కేసీఆర్ ముద్దుల మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు మంచి గాయకుడు అన్న సంగతి తెలిసిందే. హిమాన్షు గతంలో 'గోల్డెన్ అవర్' అనే పాశ్చాత్య గీతానికి కవర్ సాంగ్ చేయగా, అద్భుతమైన స్పందన లభించింది. ఆ పాట అందించిన ఉత్సాహంతో హిమాన్షు తాజాగా 'ప్రెట్టీ' అనే పాటను రూపొందించారు. 

వాస్తవానికి ఆ గీతం రేపు (జులై 24) విడుదల చేయాల్సి ఉంది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల 'ప్రెట్టీ' సాంగ్ ను తీసుకురాలేకపోతున్నామని హిమాన్షు విచారం వ్యక్తం చేశారు. 

ఈ పాట విడుదలను రీషెడ్యూల్ చేశామని, సాంకేతిక సమస్యలను చక్కదిద్దిన తర్వాత, త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తామని తెలిపారు.

More Telugu News