Rajeev Kanakala: సుమతో విడాకుల వార్తలపై స్పందించిన రాజీవ్ కనకాల!

Rajeev kanakala Interview

  • సుమ - రాజీవ్ కనకాల విడాకులంటూ వార్తలు 
  • అందులో నిజం లేదని చెప్పిన రాజీవ్
  • ఈ పుకార్ల వల్ల పిల్లలు ఇబ్బందిపడ్డారని వ్యాఖ్య 
  • సుమ ఈవెంట్స్ కి తాను అందుకే వెళుతున్నానని వెల్లడి

సుమ - రాజీవ్ కనకాల మధ్య మనస్పర్థలు వచ్చాయనీ, ఇద్దరూ కూడా విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారనే వార్తలు కొన్ని రోజులుగా షికారు చేస్తున్నాయి. తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాలకి ఈ విషయాన్ని గురించిన ప్రశ్ననే ఎదురైంది. అందుకు ఆయన తనదైన శైలిలో స్పందించాడు.

"సుమ - నేను విడాకులు తీసుకోనున్నామనే వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. అలాంటిదేమీ లేదని చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ఇదే టాక్ మా అమ్మానాన్నలు ఉన్నప్పుడు వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ బాధ ఉండేదేమో. ఇలాంటి వార్తలను సుమ పెద్దగా పట్టించుకోదు .. అంత తేలికగా నేను తీసుకోలేను. ఈ విషయంపై స్కూల్లో పిల్లలు కాస్త ఇబ్బంది పడ్డారు" అని అన్నాడు. 

"నేను .. సుమ విడిపోలేదు. కలిసే ఉన్నామని చెప్పడం కోసం, తన షోస్ కి నేను వెళ్లాను .. తన ఈవెంట్స్ కి వెళ్లాను. ఇటీవల యూఎస్ వెళ్లినప్పుడు 'రీల్స్' చేశాము. ఆ రీల్ బాగా వైరల్ అయింది కూడా. ఇలా మేము కలిసే ఉన్నాం బాబోయ్ అని చెప్పుకోవడం మాకు కష్టమైపోతోంది" అని అన్నాడు.

Rajeev Kanakala
Suma
Tollywood
  • Loading...

More Telugu News