Himanshu: హిమాన్షు కొత్త పాట కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా: కేటీఆర్

Looking forward eagerly for your song tweets KTR

  • ఈ నెల 24న కొత్త పాటను విడుదల చేయనున్నట్టు తెలిపిన హిమాన్షు
  • పాటను అందరూ ఎంజాయ్ చేస్తారంటూ ట్వీట్
  • గతంలో కూడా ఒక పాటను పాడిన హిమాన్షు

తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు మరో కొత్త సాంగ్ తో అలరించబోతున్నారు. తన కొత్త పాటను ఈ నెల 24న విడుదల చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా హిమాన్షు తెలిపాడు. ఈ పాటను మీరంతా ఆస్వాదిస్తారని ట్వీట్ చేశారు. తన కొడుకు పాట విడుదలవుతుండటంపై కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. హిమాన్షు పాట కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని కేటీఆర్ చెప్పారు. 

హిమాన్షు గతంలో కూడా పాట పాడిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ప్రముఖ గాయకుడు, గేయ రచయిత జాకబ్ లాసన్ పాడిన 'గోల్డెన్ అవర్' సాంగ్ ను ఆలపించాడు. అమెరికన్ యాక్సెంట్ లో ఆంగ్ల యాసను హిమాన్షు ఉచ్చరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు పాడబోయే పాట ఎలా ఉండబోతోందనే ఆసక్తి సర్వత్ర నెలకొంది.

More Telugu News