Kurnool: బలవంతంగా ముద్దు పెట్టుకోబోయిన భర్త.. నాలుక కొరికేసిన భార్య

Wife Bites Husband Tongue In Kurnool

  • కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఘటన
  • గొడవను చల్లార్చేందుకు భార్యను ముద్దుపెట్టుకోబోయిన భర్త
  • గాయాలతో గుత్తి ఆసుపత్రికి చేరిన భర్త
  • మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలింపు

తనను బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించిన భర్త నాలుకను అమాంతం కొరికేసిందో అర్ధాంగి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం గుట్టతండాలో జరిగిందీ షాకింగ్ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్, తుగ్గలి మండలానికి చెందిన పుష్పవతి 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న ఉదయం మరోమారు ఇద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలో భార్యకు ముద్దివ్వడం ద్వారా గొడవను కంట్రోల్ చేయాలని తారాచంద్ భావించాడు.

ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే పిచ్చి కోపంలో ఉన్న ఆమె ఒక్కసారిగా భర్త నాలుకను కొరికిపడేసింది. దీంతో తారాచంద్ లబోదిబోమంటూ గుర్తి ఆసుపత్రికి పరిగెట్టాడు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

ఈ సందర్భంగా తారాచంద్ మాట్లాడుతూ.. తన భార్య ప్రవర్తన కొంతకాలంగా సరిగా లేదని, గ్రామంలోని మరో వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉంటోందని ఆరోపించాడు. ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. మరోవైపు, పుష్పవతి మాట్లాడుతూ.. భర్త తనను బలవంతంగా ముద్దుపెట్టుకునేందుకు ప్రవర్తించడం వల్లే అలా ప్రవర్తించాల్సి వచ్చిందని పేర్కొంది. భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Kurnool
Wife
Husband
Bites Tongue
  • Loading...

More Telugu News