JD Chakravarthy: ఉత్కంఠను పెంచుతున్న జేడీ చక్రవర్తి 'దయా' .. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

JD Web Series Dayaa in Hotstar

  • ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో రూపొందిన 'దయా'
  • ప్రధానమైన పాత్రను పోషించిన జేడీ చక్రవర్తి 
  • కీలకమైన పాత్రల్లో ఈషా రెబ్బా - పృథ్వీరాజ్
  • దర్శకత్వం వహించిన పవన్ సాధినేని  
  • ఆగస్టు 4వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లు చేయడానికి టాలీవుడ్ లోని కొంతమంది హీరోలు ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే నవదీప్ .. ఆది సాయికుమార్ వంటి యంగ్ హీరోలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జేడీ చక్రవర్తి కూడా వెబ్ సిరీస్ దిశగా అడుగులు వేశాడు. అలా 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' కోసం ఆయన చేసిన వెబ్ సిరీస్ 'దయా'. 

పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ పై, ట్రైలర్ రిలీజ్ తరువాత అంచనాలు పెరిగాయి. చేపలను సప్లై చేసే ఒక వ్యాన్ డ్రైవర్ గా హీరో పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఒక 'చెవి' మాత్రమే వినిపిస్తుంది. అతని భార్యకి డెలివరీ డేట్ దగ్గరికి వస్తుంది. త్వరగా ఇంటికీ వచ్చేయమనీ .. తనకి కొంచెం తేడాగా అనిపిస్తుందని ఆమె కాల్ చేస్తుంది. అదే సమయంలో తన వ్యాన్ లో శవం ఉండటం హీరో చూస్తాడు. ఆ శవం ఎవరిది? ఎవరు చంపారు? ఆ వ్యానులోకి అది ఎలా వచ్చింది? అది హీరో మెడకి ఎలా చుట్టుకుంటుంది? అనేది కథ. 

నిజానికి ఇది చాలా ఇంట్రెస్టింగ్ లైన్ .. కదలనీయకుండా కూర్చోబెట్టే పాయింట్. ఇందులో ఈషా రెబ్బా .. రమ్య నంబీసన్ .. యాంకర్ విష్ణుప్రియ .. కమల్ కామరాజు .. జోష్ రవి ముఖ్యమైన పాత్రలను పోషించారు. కంటెంట్ పరంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఈ వెబ్ సిరీస్, ఆగస్టు 4వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

JD Chakravarthy
Eesha Rebba
Pruthivi Raj
Dayaa
  • Loading...

More Telugu News