: దినేష్ కార్తిక్ రెండో సెంచరీ, భారత్ 308/6
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ వెళ్లిన టీమిండియాను వరుసగా రెండో మ్యాచ్ లోనూ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేష్ కార్తిక్ ఆదుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సన్నాహక మ్యాచ్ లో కూడా సెంచరీ చేసాడు. దీంతో వరుసగా రెండో సెంచరీ చేసాడు. టాపార్డర్ మొత్తం చేతులెత్తేసిన దశలో కెప్టెన్ తో కలిసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 81 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన కార్తీక్, 112 బంతుల్లో 102 పరుగులు చేసాడు. అర్ధసెంచరీ చేసిన తరువాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అనంతరం స్కోరు బోర్డు పెంచే ప్రయత్నంలో 91 పరుగుల వద్ద ధోనీ ఔటయ్యాడు. అనంతరం దిగిన జడేజా(14) అండతో దినేష్ కార్తీక్ 146 పరుగులు చేసాడు. దీంతో భారత్ 6 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది.