Tollywood: వరుణ్ తేజ్-లావణ్య పెళ్లికి ముహూర్తం ఖరారు.. వేడుక ఎక్కడంటే..!

Varun tej and Lavanya wedding date fixed

  • గత నెల 9న ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ 
  • ఆగస్టు 24న పెళ్లితో ఒక్కటి కానున్న జంట
  • ఇటలీలో వివాహ వేడుక జరుగుతుందని ప్రచారం

మెగా కుటుంబంలో మరో సందడి మొదలవనుంది. రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఈ మధ్యే బిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకతో సందడి మరింత పెరగనుంది. గత నెల 9వ తేదీన నాగబాబు ఇంట్లో వరుణ్-లావణ్య ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే దీనికి హాజరయ్యారు. ఆ నాడు పెళ్లి తేదీని ప్రకటించలేదు. దాంతో, వరుణ్-లావణ్య ఎక్కడ? ఎప్పుడు? జరుగుతుందనే విషయాన్ని మెగా ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. 

ఎట్టకేలకు వీరి పెళ్లికి ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. ఆగస్టు 24వ తేదీన పెద్దల సమక్షంలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటికాబోతున్నట్టు తెలుస్తోంది. పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరగనుందని మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సమాచారం. షాపింగ్, ఇతర పనుల కోసం వరుణ్, లావణ్య ఇప్పటికే విదేశాలకు వెళ్లినట్టు చెబుతున్నారు. మిస్టర్ సినిమాలో వీరిద్దరూ తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమా టైమ్ లోనే వీరిద్ధరూ ప్రేమలో పడ్డారు.

Tollywood
varuntej
lavanya tripati
marriage
  • Loading...

More Telugu News