Telangana: ఉద్యోగులకు శుభవార్త చెప్పబోతున్న సీఎం కేసీఆర్!

TS govt to announce 2nd PRC soon

  •  రెండో పీఆర్సీ, మ‌ధ్యంత‌ర భృతి ప్రకటనకు కసరత్తు
  • ఈహెచ్‌ఎస్‌ పైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం
  • ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు గుడ్‌న్యూస్‌ చెప్పనుంది. వారి జీతభత్యాలు పెరగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం త్వరలో రెండో పీఆర్సీని వేయనుంది. ఇదే సమయంలో మ‌ధ్యంత‌ర భృతిని కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్‌ఎస్‌పైనా కీలక నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది. ఈహెచ్‌ఎస్‌ పటిష్ఠ అమలుకు విధి విధానాలను రూపొందించనుంది. ప్రభుత్వ ఉద్యోగుల హౌసింగ్‌పై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. రాబోయే పది రోజుల్లో అన్ని ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ఈ అంశాలపై చర్చించి విధి విధానాలపై నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Telangana
govt
employees
cm kcr
PRC
IR
  • Loading...

More Telugu News