Anand Devarakonda: 50 కోట్ల దిశగా పరుగులు తీస్తున్న 'బేబి'

Baby Movie Update

  • ఈ నెల 14వ తేదీన వచ్చిన 'బేబి'
  • తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 
  • 6 రోజుల్లో 43.8 కోట్ల వసూళ్లు 
  • ఈ వీకెండుకి 50 కోట్ల మార్కును టచ్ చేసే ఛాన్స్  

ఇటీవల కాలంలో చాలానే ప్రేమకథలు వచ్చాయి. అయితే అవేవీ కూడా ఆశించిన స్థాయిలో యూత్ కి కనెక్ట్ కాలేదు. వీకెండ్ తరువాత థియేటర్లలో కనిపించలేదు. కానీ 'బేబి' మాత్రం మొదటిరోజు నుంచే వసూళ్ల పరంగా తన దూకుడు చూపిస్తూ వెళుతోంది. వీకెండ్ తరువాత కూడా అదే జోరును కొనసాగిస్తూ ఉండటం విశేషం. 

నిన్నటితో ఈ సినిమా 6 రోజులను పూర్తి చేసుకుంది. ఈ 6 రోజులలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 43.8 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ వీకెండ్ పూర్తయ్యేనాటికి ఈ సినిమా 50 కోట్ల మార్క్ ను టచ్ చేయడం ఖాయమేననే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఆ దిశగానే ఈ సినిమా ఇప్పుడు పరుగులు తీస్తోంది. 

ఈ కథ అంతా కూడా ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో నడవడం వలన, యూత్ కి బాగా కనెక్ట్ అయింది. కథా పరంగా .. పాత్రల పరంగా లోపాలు ఉన్నప్పటికీ, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా తరువాత వైష్ణవీ చైతన్యకి వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయని అంటున్నారు.

More Telugu News