Cricket: ఆసియా కప్ షెడ్యూల్ ప్రకటన.. సెప్టెంబర్ 2న భారత్-పాక్ మ్యాచ్

Asia Cup 2023 Schedule Announced

  • ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 17 వరకు టోర్నీ
  • క్యాండీ వేదికగా భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్
  • అదే వేదికపై సెప్టెంబర్ 4న నేపాల్ తో భారత్ ఢీ

ఆసియా కప్ 2023 షెడ్యూల్‌ను ఎట్టకేలకు బుధవారం బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధిపతి జై షా ప్రకటించారు. ఈసారి టోర్నమెంట్‌ హైబ్రిడ్ మోడల్‌లో ఉండనుంది. ఆగస్టు 30న పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో పాకిస్థాన్-నేపాల్ మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమవుతుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ పోరు సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీలో జరగనుంది. మరో గ్రూప్ దశలో భారత్-నేపాల్ అదే వేదికపై సెప్టెంబర్ 4న తలపడనున్నాయి.

ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 టోర్నీ జరగనుంది. ఆరు దేశాలు పాల్గొనే ఈ మినీ టోర్నీలో నాలుగు మ్యాచ్ లు పాకిస్థాన్ లో, తొమ్మిది మ్యాచ్ లు శ్రీలంకలో జరగనున్నాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, నేపాల్; గ్రూప్ బీలో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక ఆడనున్నాయి. సెప్టెంబర్ 17న కొలంబోలో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. మూడు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు, ఒక సూపర్ ఫోర్ స్టేజ్ మ్యాచ్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. మిగతా అన్ని టోర్నీలు శ్రీలంకలో జరగనున్నాయి.

Cricket
Team India
India
Pakistan
asia cup
  • Loading...

More Telugu News