Pawan Kalyan: అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ, ఆ తర్వాత జనసేనాని ట్వీట్

Janasena chief meets Amit Shah

  • కేంద్ర హోంమంత్రితో 15 నిమిషాలపాటు సమావేశమైన జనసేనాని
  • అమిత్ షాతో భేటీ అద్భుతంగా జరిగిందని పవన్ ట్వీట్
  • ఏపీ భవిష్యత్తుకు నాంది పలుకుతాయని పేర్కొన్న జనసేనాని

ఎన్డీయే సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఇరువురు దాదాపు పదిహేను నిమిషాలు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. జనసేనాని అంతకుముందు రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ మురళీధరన్ ను కలిశారు. 

అమిత్ షాతో భేటీ అనంతరం జనసేనాని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రితో అద్భుతమైన సమావేశం జరిగిందని పేర్కొన్నారు. పరస్పర చర్చలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక సుసంపన్నమైన భవిష్యత్తుకు నాంది పలుకుతాయన్నారు.

Pawan Kalyan
Janasena
BJP
Amit Shah

More Telugu News