Surya: వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న సూర్య మూవీ!

Surya in Sudha Kongara Movie

  • సూర్య తాజా చిత్రంగా రూపొందుతున్న 'కంగువ'
  • కథానాయికగా సందడి చేయనున్న దిశా పటాని 
  • ఆ తరువాత సుధా కొంగరతో సెట్స్ పైకి వెళ్లనున్న సూర్య 
  • యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణ భాగస్వామిగా ఉన్న సినిమా 


సూర్య ఒక వైపున యాక్షన్ తో కూడిన సినిమాలను చేస్తూనే, మరో వైపున వాస్తవ సంఘటనలకి సంబంధించిన కథలకు ప్రాధాన్యతనిస్తున్నాడు. 'ఆకాశం నీ హద్దురా' వంటి బయోపిక్ లు చేయడానికి కూడా ఆయన వెనుకాడడు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఆ సినిమా, ఏ స్థాయి ఆదరణను పొందిందనేది అందరికీ తెలిసిందే.

ఆ సినిమా తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఇది రతన్ టాటా బయోపిక్ అనే ప్రచారం జరిగింది. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదనేది తేలిపోయింది. అయితే కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగానే ఈ సినిమా రూపొందనున్నట్టుగా తెలుస్తోంది. 

క్రైమ్ ఎలిమెంట్స్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనుందని అంటున్నారు. ప్రస్తుతం సూర్య 'కంగువ' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. దిశా పటాని కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, జ్ఞానవేల్ రాజాతో కలిసి యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఆయన సుధా కొంగర ప్రాజెక్టుపైకి వెళ్లనున్నాడని అంటున్నారు. 

Surya
Sudha Kongara
Kollywood
  • Loading...

More Telugu News