Sri Simha: 'ఉస్తాద్' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

Ustaad lyrical song released

  • శ్రీ సింహా హీరోగా రూపొందిన 'ఉస్తాద్'
  • ఆయన జోడీ కట్టిన కావ్య కల్యాణ్ రామ్ 
  • సంగీతాన్ని అందించిన అకీవా 
  • ఆగస్టు 12వ తేదీన సినిమా విడుదల

సింహా కోడూరి హీరోగా 'ఉస్తాద్' సినిమా రూపొందింది. వారాహి చలన చిత్ర బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, ఫణిదీప్ దర్శకత్వం వహించాడు. యాక్షన్ ను .. ఎమోషన్స్ ను టచ్ చేస్తూ సాగే లవ్ స్టోరీ ఇది. ఈ సినిమాలో కథానాయికగా కావ్య కల్యాణ్ రామ్ అలరించనుంది. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. "చుక్కల్లోంచి తొంగిచూసే చక్కానైనా జాబిల్లీ, పక్కాకొచ్చి కూర్చున్నాది అయ్ బాబోయ్ ఏం చేయాలి" అంటూ ఈ పాట సాగుతోంది. హీరో .. హీరోయిన్స్ పై ఈ పాటను చిత్రీకరించారు. హీరోతో కలిసి హీరోయిన్ ట్రావెల్ చేసే సందర్భంలో వచ్చే పాట ఇది. 

అకీవా స్వరపరిచిన ఈ పాటకి రెహ్మాన్ సాహిత్యాన్ని అందించగా, కార్తీక్ ఆలపించాడు. సింహా ఇంతవరకూ మూడు నాలుగు సినిమాలు చేశాడు. అయితే అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందువలన ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాలనే ఆశతో ఆయన ఉన్నాడు. ఇక కావ్య కల్యాణ్ రామ్ కూడా సరైన బ్రేక్ కోసమే వెయిట్ చేస్తోంది.

More Telugu News