INDIA: ‘ఇండియా’ కూటమికి ట్యాగ్​లైన్‌గా ‘జీతేగా భారత్​’

INDIA alliance gets a new tagline Jeetega Bharat
  • బెంగళూరులో రెండు రోజుల పాటు ప్రతిపక్ష పార్టీల భేటీ
  • హాజరైన 26 పార్టీల ప్రతినిధులు
  • కూటమి పేరులో భారత్ పేరు ఉండాలని భావించిన పార్టీలు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఒక్కటవుతున్నాయి. బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో పాల్గొన్న 26 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. తమ ఫ్రంట్ కు 'ఇండియా' అనే పేరును ప్రకటించాయి. ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్. తాజాగా ఈ కూటమికి ట్యాగ్‌లైన్‌ గా 'జీతేగా భారత్'ను ఎంచుకున్నాయి. గత రాత్రి జరిగిన చర్చల తర్వాత జీతేగా భారత్ (భారత్ గెలుస్తుంది)పై తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టినప్పుడు కూటమి పేరులో భారత్ అనే పదం ఉండాలని భావించారు. కానీ, అది సాథ్యం కాకపోవడంతో ఇది ట్యాగ్‌లైన్‌లో కనిపించాలని నిర్ణయించుకున్నారు.
INDIA
alliance
Jeetega Bharat
NDA
BJP
Congress

More Telugu News