Chiranjeevi: పాస్ పోర్టు ఆఫీసర్ గా మెగాస్టార్!

Kalyan Krishna Movie Update

  • కల్యాణ్ కృష్ణతో చిరూ మూవీ 
  • సుస్మిత నిర్మాతగా రూపొందనున్న సినిమా
  • కథానాయికగా కనిపించనున్న త్రిష 
  • ముఖ్యమైన పాత్రలో అలరించనున్న శ్రీలీల

చిరంజీవి తన తదుపరి ప్రాజెక్టుల కోసం వరుసగా యంగ్ డైరెక్టర్లను లైన్లో పెడుతున్నారు. అనిల్ రావిపూడి .. కల్యాణ్ కృష్ణ ... శ్రీవశిష్ఠలతో సినిమా చేయడానికి ఆయన రెడీ అవుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అనిల్ రావిపూడితో యాక్షన్ కామెడీ .. శ్రీవశిష్ఠతో ఫాంటసీ జోనర్లో చేయనున్నట్టుగా చెబుతున్నారు. 

ఇక కల్యాణ్ కృష్ణతో చేయనున్న సినిమాకి వచ్చేసరికి మరో ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి 'పాస్ పోర్టు ఆఫీసర్' గా కనిపించనున్నారని అంటున్నారు. ఈ పాత్రలో ఆయన లుక్ చాలా స్టైలీష్ గా ఉండనుందని చెబుతున్నారు. ఈ తరహా పాత్రను చిరంజీవి పోషించడం ఇదే మొదటిసారి. 

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది మలయాళంలో మోహన్ లాల్ చేసిన ఒక సినిమాకి రీమేక్ అనే టాక్ వచ్చింది. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదని చెబుతున్నారు. త్రిష కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, శ్రీలీల ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. 

Chiranjeevi
Trisha
Sreeleela
Kalyan Krishna
  • Loading...

More Telugu News