Janga Krishna Murthy: టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ జంగా?

Janga Krishna Murthy Will Be New TTD Chaiman

  • వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ టీటీడీ చైర్మన్‌గా కొనసాగుతున్న వైవీ సుబ్బారెడ్డి
  • ఈ వారంలో సమీక్ష నిర్వహించనున్న జగన్
  • మరికొన్ని కీలక పదవుల్లోనూ మార్పులు!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచీ వైవీనే టీటీడీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. మొదటి విడత పదవీకాలం ముగిసిన తర్వాత రెండోసారి కూడా ఆయనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన స్థానంలో జంగా కృష్ణమూర్తిని నియమించాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం. టీటీడీ బోర్డు నియమాకంపై సమీక్ష అనంతరం జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

దీంతోపాటు మరికొన్ని పార్టీ పదవుల్లోనూ మార్పు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త పదవి నుంచి సీనియర్ నేత విజయసాయిని గతేడాది తొలగించారు. అలాగే, ప్రాంతీయ సమన్వయకర్త పదవికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడా స్థానాన్ని విజయసాయిరెడ్డికి కానీ, లేదంటే మరో నాయకుడికి ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే, మరికొన్ని స్థానాల్లోనూ కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Janga Krishna Murthy
TTD
YV Subba Reddy
YS Jagan
  • Loading...

More Telugu News