Anand Devarakonda: మండే కూడా తగ్గని 'బేబి' దూకుడు .. 4 రోజుల వసూళ్లు ఎంతంటే..!

Baby Movie Update

  • తొలిరోజునే 7 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టిన 'బేబి'
  • మౌత్ టాక్ తో ఆ తరువాత పెరిగిన వసూళ్లు 
  • మూడో రోజు నాటికి 23.5 కోట్ల గ్రాస్ 
  • నాలుగో రోజుతో రాబట్టిన మొత్తం 31 కోట్ల గ్రాస్
  • ఈ వారంలో 50 కోట్ల మార్కును టచ్ చేసే ఛాన్స్    

ఇటీవల కాలంలో తెలుగు తెరపైకి ప్రేమకథలు చాలానే వచ్చాయి. ఆ జాబితాలో తన పేరును నమోదు చేస్తూ ఈ నెల 14న వచ్చిన సినిమానే 'బేబి'. ఆనంద్ దేవరకొండ - వైష్ణవి చైతన్య - విరాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరపైకి వచ్చింది. తొలి రోజునే యూత్ కి కనెక్ట్ అయింది. 

తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 7.1 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఆ మరుసటి రోజున మరింత పుంజుకున్న ఈ సినిమా, మూడో రోజుకి 23.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. వీకెండ్ తరువాత ఈ సినిమా వసూళ్లు తగ్గే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ నాలుగో రోజున కూడా అదే జోరును కొనసాగించింది. 

4వ రోజుతో కలుపుకుని ఈ సినిమా 31 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఆనంద్ దేవరకొండ కెరియర్లో ఈ స్థాయి వసూళ్లను సాధించిన సినిమా ఇదే కావడం విశేషం. ఈ శుక్రవారం నాటికి ఈ సినిమా 50 కోట్ల మార్కును టచ్ చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. సాయిరాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, హీరోలకంటే కూడా హీరోయిన్ కి ఎక్కువ క్రేజ్ ను తీసుకురావడం విశేషం.

More Telugu News