Bellamkonda Srinivas: సీక్రెట్ ఏజెంటుగా రంగంలోకి బెల్లంకొండ!

Bellamkonda in Vishwa Movie

  • స్పై యాక్షన్ థ్రిల్లర్ పట్ల పెరుగుతున్న ఆదరణ 
  •  అఖిల్ .. నిఖిల్ సినిమాలు దెబ్బతిన్నా ఆగని హీరోలు 
  • ఆ దిశగానే అడుగులేస్తున్న బెల్లంకొండ 
  • 'పరంపర' దర్శకుడికి ఇచ్చిన ఛాన్స్ 
  • తెలుగుతో పాటు హిందీలోను రిలీజ్

ఈ మధ్య కాలంలో హీరోలంతా 'స్పై' యాక్షన్ థ్రిల్లర్ జోనర్ వెంట పడుతున్నారు. తమలోని యాక్షన్ హీరోను స్టైలీష్ గా ఆవిష్కరించడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. అడివి శేష్ నుంచి 'గూఢచారి' వచ్చిన దగ్గర నుంచి మళ్లీ ఈ జోనర్ దారిలో ట్రాఫిక్ పెరిగింది. ఆల్రెడీ ఈ జోనర్లో 'ఏజెంట్ ' చేసి అఖిల్ .. 'స్పై' చేసి నిఖిల్ దెబ్బతిన్నారు. 

అయినా ఇప్పుడు 'డెవిల్'గా రావడానికి కల్యాణ్ రామ్ రెడీ అవుతున్నాడు. ఇదే జోనర్లో ఇప్పుడు ఒక సినిమా చేయడానికి బెల్లంకొండ శ్రీనివాస్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి దర్శకుడు విశ్వ. 'పరంపర' వెబ్ సిరీస్ తో విశ్వ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన వినిపించిన ఒక కథకి బెల్లంకొండ వెంటనే ఓకే చెప్పాడని అంటున్నారు. 

అందరి మాదిరిగానే బెల్లంకొండ శ్రీనివాస్ సీక్రెట్ ఏజెంటుగా మాత్రమే కనిపిస్తే ఇక కొత్తదనం ఏముంటుంది? ఈ సినిమాలో ఆయన మరో పాత్రలో కూడా కనిపించనున్నాడు. డ్యూయెల్ రోల్ ఉండటం వల్లనే ఈ సినిమా చేయడానికి ఆయన అంగీకరించాడట. తెలుగుతో పాటు హిందీలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

Bellamkonda Srinivas
Vishwa
Tollywood
  • Loading...

More Telugu News