MS Dhoni: షోరూమ్ కాదిది, ధోనీ భాయ్ గ్యారేజీ.. కెప్టెన్ కూల్ బైక్ కలెక్షన్ వీడియో ఇదిగో!

Venkatesh prasad and sunil joshi share video of ms dhoni bike collection in ranchi viral

  • ధోనీ గ్యారేజ్ ను సందర్శించిన మాజీ క్రికెటర్లు
  • సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన వెంకటేశ్ ప్రసాద్
  • అరుదైన పాత కార్లను విదేశాల నుంచి తెప్పించుకున్న ధోని

టీమిండియా మాజీ సారథి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి కార్లు, బైక్ లంటే చాలా ఇష్టం.. ఎంతగా అంటే నచ్చిన బైక్ ను వెంటనే కొనేసి ఇంట్లో పెట్టుకునేంత.. ఇలా కొన్న బైక్ లు కార్ల కోసం ధోనీ ఏకంగా ఓ గ్యారేజ్ కట్టించుకున్నారు. అందులో ఎన్ని బైక్ లు ఉన్నాయో లెక్కేలేదట. ఈ గ్యారేజ్ లో ఉన్నన్ని బైక్ లు షోరూమ్ లో కూడా ఉండవట. తాజాగా మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, సునీల్ జోషీ ఈ గ్యారేజ్ ను సందర్శించిన వీడియో బయటకు వచ్చింది.

ధోని గ్యారేజ్ ను వీడియో తీసి వెంకటేశ్ ప్రసాద్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలో గ్యారేజ్ లో ధోని సేకరించిన కొత్త, పాత బైక్ లు, రకరకాల మోడల్ కార్లను చూడొచ్చు. కొన్ని కార్లను ధోని విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్నారని, ఇంకొన్నింటిని భారత ఆర్మీ నుంచి కొనుగోలు చేశారని తెలుస్తోంది. బైక్ లను సేకరించడం మాత్రమే కాదు.. వాటికి తరచుగా సర్వీసింగ్ కూడా స్వయంగా ధోనీయే చేస్తారు. దీనికి సంబంధించిన ఫొటోలను ధోనీ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం పోస్టు చేస్తుంటారు.

More Telugu News