Chiranjeevi: అనిల్ రావిపూడితో మెగాస్టార్ మూవీ!

Chiranjeevi in Anil Ravipudi Movie

  • శ్రీ వశిష్ఠ దర్శకత్వంలో సినిమా చేయనున్న చిరూ 
  • కల్యాణ్ కృష్ణకి కూడా గ్రీన్ సిగ్నల్
  • రీసెంట్ గా అనిల్ రావిపూడికి ఓకే చెప్పిన మెగాస్టార్ 
  • దిల్ రాజు బ్యానర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ప్రాజెక్టు  


కోలీవుడ్ లో రజనీకాంత్ .. కమల్ వంటి సీనియర్ స్టార్ హీరోలు యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతున్నారు. అదే వాతావరణం ఇప్పుడు టాలీవుడ్ లోను కనిపిస్తోంది. చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ ఇలా అందరూ కూడా యువ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

చిరంజీవి తన తదుపరి సినిమాలను శ్రీవశిష్ఠ దర్శకత్వంలోను .. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోను చేయనున్నారు. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి ఒక కథను వినిపించడం .. మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారని అంటున్నారు. 

ప్రస్తుతం బాలకృష్ణతో అనిల్ రావిపూడి 'భగవంత్ కేసరి' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను దసరాకి విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత చిరంజీవితోనే అనిల్ రావిపూడి సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు. మొత్తానికి అనిల్ రావిపూడి అంచలంచెలుగా ఎదుగుతూ చిరంజీవి వరకూ వచ్చేశాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

Chiranjeevi
Anil Ravipudi
Sri Vashista
Kalyan Krishna
  • Loading...

More Telugu News