Vijay Devarakonda: 'బేబి' చూస్తూ నన్ను నేను మరిచిపోయాను: విజయ్ దేవరకొండ

Baby movie block buster evnet

  • హైదరాబాదులో జరిగిన 'బేబి' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ 
  • ముఖ్య అతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండ
  • ఈ కథ నిజంగా జరిగిందేమోనని అనిపించిందని వ్యాఖ్య 
  • ఆనంద్ సెలక్షన్ కరెక్టుగానే ఉందని వెల్లడి
  • వైష్ణవి గొప్పగా చేసిందంటూ కితాబు  

ప్రేమకథా చిత్రంగా 'బేబి' థియేటర్లకు వచ్చింది. ఆనంద్ దేవరకొండ - వైష్ణవి చైతన్య - విరాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ హైదరాబాదులో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను నిర్వహించింది. అల్లు అరవింద్ .. బన్నీవాసు .. మారుతి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

ముఖ్య అతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. "ఈ సినిమా చూస్తూ నేను ఒక యాక్టర్ ను అనే విషయం మరిచిపోయాను. ఈ కథ అంతా నిజంగా జరిగిందేమోనని అనుకున్నాను. ప్రీమియర్ షో చూసి వస్తున్నప్పుడు, ఎలా ఉందో అడగడం కోసం బయట మేకర్స్ వెయిట్ చేశారు. కానీ క్లైమాక్స్ ఎమోషన్స్ ను తలచుకుంటూ బయటికి వచ్చిన నేను అప్పుడు ఏమీ మాట్లాడలేకపోయాను. కానీ నాలాగే అందరూ ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారు. అందువల్లనే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది" అన్నాడు. 

"నీ సినిమాలకి సంబంధించిన వ్యవహారాలు నువ్వే చూసుకోరా" అని ఆనంద్ కి చెప్పాను. 'బేబి' గురించి చివరివరకూ నాకు తెలియదు. సినిమా చూసిన తరువాత గర్వంగా అనిపించింది. అమ్మాయిలు అలా ఉంటారు .. అబ్బాయిలు ఇలా ఉంటారని చెప్పడం ఈ సినిమా ఉద్దేశం కాదు. ఎలా ఉండాలో .. ఎలా ఉండకూడదో తెలుసుకోవడం కోసమే. వైష్ణవి గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆమె యూట్యూబ్ స్టార్ అని ఇప్పుడు అంటున్నారు. అందరూ చాలా బాగా చేశారు" అంటూ చెప్పుకొచ్చారు. 

Vijay Devarakonda
Anand Devarakonda
Vaishnavi Chaitanya
  • Loading...

More Telugu News