Vaishnavi Chaitanya: లైఫ్ లో ఇంతకంటే ఏం కావాలి?: 'బేబి' ఈవెంటులో వైష్ణవి చైతన్య

Baby movie block buster evnet

  • ఈ నెల 14న విడుదలైన 'బేబీ'
  • హైదరాబాద్ లో జరిగిన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్
  • చీఫ్ గెస్టుగా వచ్చిన విజయ్ దేవరకొండ  
  • మరిన్ని మంచి సినిమాలు చేస్తానన్న ఆనంద్ దేవరకొండ

వైష్ణవి చైతన్య ప్రధానమైన పాత్రగా .. ఆనంద్ దేవరకొండ - విరాజ్ ముఖ్య పాత్రలుగా 'బేబి' సినిమా రూపొందింది. ఎస్ కే ఎన్ నిర్మించిన ఈ సినిమాకి, సాయిరాజేశ్ నీలం దర్శకత్వం వహించాడు. 3 రోజుల్లోనే ఈ సినిమా 23.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ చీఫ్ గెస్టుగా, ఈ సినిమా టీమ్ హైదరాబాద్ - జేఆర్సీ కన్వెన్షన్ లో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను నిర్వహించింది. 

ఈ వేదికపై నాగబాబు మాట్లాడుతూ .. "సాయిరాజేశ్ నీలం చాలా కాలంగా ఒక సీరియస్ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ సినిమా చేశాడు .. మంచి హిట్ కొట్టాడు. కానీ ఆయన కామెడీ సినిమాలను వదిలేయకూడదు. 'హృదయ కాలేయం' .. 'కొబ్బరిమట్ట' వంటి సినిమాలను ఆయన చేయాలి. ఆయన కామెడీ సినిమాలకి నాలాంటి ఫ్యాన్స్ ఉన్నారు" అని అన్నారు. 

అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "ఈ సినిమా ఇంత గొప్ప హిట్ కావడానికి కారణం సాయిరాజేశ్ నీలం. ఆనంద్ దేవరకొండ బ్రిడ్జ్ సీన్ లో ఏడిపించేశాడు. నీరజ్ కూడా చాక్ లెట్ బాయ్ లా కనిపిస్తూ, చాలా బాగా చేశాడు. వైష్ణవి చాలా బాగా నచ్చింది .. ఆమెతో ఒక లేడీ ఓరియెంటెడ్ కథను ప్లాన్ చేయాలనుంది" అని చెప్పారు. 

విరాజ్ మాట్లాడుతూ .. "ఎక్కడికి వెళ్లినా అందరూ నా పాత్రను తిడుతున్నారు. అలాగే కొన్ని చోట్ల వైష్ణవిని తిడుతున్నారు. అందుకు కారణం వాళ్లంతా ఆ పాత్రలకి కనెక్ట్ కావడమే. అలా ఆ పాత్రలను డిజైన్ చేసిన సాయి రాజేశ్ కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సెలబ్రేషన్స్ కి విజయ్ దేవరకొండ రావడం హ్యాపీగా ఉంది" అని అన్నారు.

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ .. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా నుంచి నేను విజయ్ దేవరకొండ అభిమానిని. నాపై నమ్మకంతో ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన మేకర్స్ కి ధన్యవాదాలు. హీరోయిన్ గా నేను పెద్ద తెరపై నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. లైఫ్ లో ఇందుకోసమే కదా ఇంతకాలం వెయిట్ చేస్తూ వచ్చింది అనిపించింది. జులై 14 అనే డేట్ నా లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అంటూ హర్షాన్ని వ్యక్తం చేసింది.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ .. 'ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి నేను షాక్ అయ్యాను. నాపై మీకున్న ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేను. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ .. మరిన్ని మంచి సినిమాలు చేస్తాను. నీరజ్ .. వైష్ణవి యాక్టింగ్ కి కూడానా విజిల్స్ పడుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. నేను ప్రామిస్ చేస్తున్నాను .. మా అన్న పేరును నిలబెడతాను" అని చెప్పాడు.

More Telugu News