Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మరో థ్రిల్లర్ .. 'రుద్రాక్ష'

Rudraksha Movie Update

  • నిరాశపరిచిన 'ఛత్రపతి' రీమేక్ 
  • రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టిన బెల్లంకొండ శ్రీను 
  • 'రాక్షసుడు' దర్శకుడికి మరో ఛాన్స్
  • నిర్మాతగా రంగంలోకి జ్ఞానవేల్ రాజా


బెల్లంకొండ శ్రీనివాస్ 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో బాలీవుడ్ కి పరిచయం కావాలని అనుకున్నాడు. కానీ ఫలితం పరంగా అక్కడ అతనికి నిరాశే ఎదురైంది. ఆ సినిమా కారణంగా ఇక్కడ అతనికి గ్యాప్ కూడా చాలానే వచ్చేసింది. అందువల్లనే మళ్లీ ఇక్కడి యంగ్ హీరోలకు పోటీ ఇవ్వడానికి గాను రేసులోకి దిగిపోయాడు.

సాధ్యమైనంత త్వరగా తన నుంచి థియేటర్లకు సినిమాలను తీసుకుని వెళ్లడానికి ట్రై చేస్తున్నాడు. అందులో భాగంగానే వరుస ప్రాజెక్టులను ఒప్పుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో తనకి హిట్ ఇచ్చిన 'రాక్షసుడు' డైరెక్టర్ రమేశ్ వర్మకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. 

ఈ సినిమా కూడా థ్రిల్లర్ జోనర్లో సాగుతుందని సమాచారం. ఈ సినిమాకి 'రుద్రాక్ష' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందనీ, ఆగస్టు నుంచి షూటింగు మొదలవుతుందని టాక్.

Bellamkonda Srinivas
Ramesh Varma
Rudraksha Movie
  • Loading...

More Telugu News