Pawan Kalyan: మానవ హక్కుల కమిషన్ కు ధన్యవాదాలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan thanked HRC

  • ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల నిరసన
  • జనసేన నేత కొట్టే సాయిపై చేయి చేసుకున్న సీఐ అంజూ యాదవ్
  • సీఐకి నోటీసులు పంపిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
  • సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలీసు శాఖకు ఆదేశాలు
  • సుమోటోగా స్వీకరించారంటూ హెచ్చార్సీకి పవన్ ధన్యవాదాలు

శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ జనసేన నేత కొట్టే సాయిపై చేయి చేసుకోవడం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్... సీఐ అంజూ యాదవ్ కు నోటీసులు జారీ చేయడమే కాకుండా, ఘటపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ పోలీసు విభాగాన్ని ఆదేశించింది. 

దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. మా నాయకుడిపై జరిగిన ఘటనను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఇది తమ నాయకుడు కొట్టే సాయిపై జరిగిన దాడి మాత్రమే కాదని, వ్యవస్థపై జరిగిన దాడిగా భావించాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇవాళ సాయిపై జరిగింది... రేపు ఇంకొకరిపై జరగొచ్చు అని తెలిపారు. నిరసన తెలియజేయడం ప్రజల ప్రాథమిక హక్కు అని, దానిని దెబ్బతీస్తే ఊరుకోబోము అని స్పష్టం చేశారు.

Pawan Kalyan
Human Rights Commission
HRC
Kotte Sai
CI Anju Yadav
Srikalahasti
  • Loading...

More Telugu News