Revanth Reddy: వ్యవసాయం అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదు డ్రామారావు.. కేటీఆర్‌‌పై రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy fires on minister KTR

  • రాహుల్‌కు వడ్లకు, ఎడ్లకు తేడా తెలియదన్న కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ మండిపాటు
  • వ్యవసాయం అంటే జూబ్లిహిల్స్ గెస్ట్ హౌస్‌లలో సేద తీరడం కాదన్న టీపీసీసీ చీఫ్
  • గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన? అంటూ ఎద్దేవా 

రాహుల్ గాంధీకి వడ్లకు, ఎడ్లకు తేడా తెలియదంటూ బీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వ్యవసాయమంటే అమెరికాలో అంట్లు తోమడం కాదని మండిపడ్డారు. ప్రాసకోసం పాకులాడే గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అంటూ ఎద్దేవా చేశారు. సోమవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. 

‘‘వ్యవ'సాయం’ అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదు డ్రామారావు.. ఎవుసం అంటే జూబ్లిహిల్స్ గెస్ట్ హౌస్‌లలో సేద తీరడం కాదు.. సినిమా వాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదు. అది మట్టి మనసుల పరిమళం.. మట్టి మనుషుల ప్రేమ. ఎడ్లు - వడ్లు అని ప్రాసకోసం పాకులాడే ‘గాడిద’కేం తెలుసు గంధపు చెక్కల వాసన” అని ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు.

తన ట్వీట్‌కు డ్రామారావు, ‘బైబై’ ‘కేసీఆర్’ అనే హ్యాష్‌ట్యాగ్‌లను రేవంత్ జత చేశారు. ఇటీవల రైతులతో రాహుల్ గాంధీ ముచ్చటించిన ఫొటోలను షేర్ చేశారు. వరి మడిలోకి దిగి రాహుల్ నాట్లు వేసిన, ట్రాక్టర్ నడిపిన ఫొటోలను పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News