vaishnavi chaitanya: బోల్డ్ సీన్స్‌పై స్పందించిన ‘బేబీ’

baby movie vaishnavi chaitanya about viraj liplock scene

  • వసూళ్లు కొల్లగొడుతున్న ‘బేబీ’ సినిమా
  • బోల్డ్ సీన్స్‌లో నటించిన వైష్ణవి చైతన్య
  • మూవీ టీమ్‌ తనను కంఫర్ట్‌గా చూసుకుందని వెల్లడి
  • ఆయా సీన్స్‌ను తాను సన్నివేశంలో భాగంగానే చూశానన్న హీరోయిన్

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 14న విడుదలై.. వసూళ్లను కొల్లగొడుతోంది. ముఖ్యంగా బేబీ మూవీని చూసేందుకు యువత పోటెత్తుతున్నారు. ఈ సినిమాలోని బోల్డ్‌ సీన్స్‌ కూడా చర్చనీయాంశమయ్యాయి.

ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా తొలి సినిమాలోనే బోల్డ్‌ సీన్స్‌లో నడించడంపై వైష్ణవి చైతన్య స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. రొమాన్స్‌, లిప్‌లాక్‌ సీన్లలో నటించడం చాలా కష్టమని, కానీ బేబీ టీమ్‌ తనను కంఫర్ట్‌గా చూసుకుందని చెప్పింది. ఆ సీన్‌ చేసే రోజు సెట్లో చాలా తక్కువ మంది ఉండేలా జాగ్రత్త పడ్డారని తెలిపింది.

బోల్డ్‌ సీన్స్ చేసే సమయంలో విరాజ్‌ అశ్విన్‌ కూడా సాయపడ్డాడని వైష్ణవి చైతన్య వివరించింది. ‘‘సినిమా కోసం ఇంత వరకూ చాలా సీన్లు చేశాం. ఇది కూడా అలాంటిదే అనుకో.. జస్ట్‌ మనం నటిస్తున్నామంతే” అని ధైర్యం చెప్పాడని తెలిపింది.

ఆ సమయంలో ఆయా సీన్స్‌ను తాను సన్నివేశంలో భాగంగానే చూశానని చెప్పుకొచ్చింది. సినిమా చూశాక ఇంట్లో వాళ్లూ కూడా అలాగే ఆలోచించారని చెప్పింది. సినిమాను పూర్తిగా చూసిన తర్వాత ఆ లిప్‌లాక్‌, బోల్డ్‌ సీన్స్‌ గుర్తుండవని, అంతకు మించిన భావోద్వేగాలు అందులో చాలా ఉన్నాయని తెలిపింది.

More Telugu News