: ఫిక్సింగ్ వెనుక దావూద్ హస్తం!
క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం వెనుక అధోజగత్తు రారాజు దావూద్ ఇబ్రహీం హస్తముందని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. దావూద్ పాత్రపై కీలక ఆధారాలు లభ్యమైనట్టు వారు తెలిపారు. దావూద్ తో పాటు మాఫియా డాన్ చోటా షకీల్ కూడా ఈ ఫిక్సింగ్ వ్యవహారంలో సూత్రధారే అని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ దిశగా దర్యాప్తు ముమ్మరం చేస్తామని వారు తెలిపారు.