Tirumala: జూన్ నెలలో రూ.100 కోట్లు దాటిన తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం
- గత నెలలో వెంకన్నకు హుండీ ద్వారా రూ.116 కోట్ల ఆదాయం
- జూన్ లో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 23 లక్షలు
- 1.06 కోట్ల లడ్డూలు విక్రయించిన టీటీడీ
తిరుమల శ్రీవారికి గత నెలలో భారీగా ఆదాయం లభించింది. స్వామివారికి హుండీ ద్వారా రూ.116.14 కోట్ల ఆదాయం లభించింది.
జూన్ నెలలో వెంకటేశ్వరస్వామిని 23 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. 10.8 లక్షల మంది భక్తులు తలనీలాల మొక్కు తీర్చుకున్నారు. అదే సమయంలో 24.38 లక్షల మంది భక్తులు తిరుమల కొండపై అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు టీటీడీ 1.06 కోట్ల లడ్డూలు విక్రయించింది.
కాగా, ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేకుండా క్యూ లైన్లలోకి వచ్చిన భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల వెంకన్నను 87,171 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,273 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.3.68 కోట్ల ఆదాయం లభించింది.