Honey Rose: ఎవ్వరూ ఊహించని పాత్రలో హనీ రోజ్​.. షాకిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్లు

Honey Rose First Look Posters in Rachel shocks audience
  • బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డిలో నటించిన హనీ రోజ్
  • రాచెల్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న మలయాళ నటి
  • తెలుగులో రాహేలుగా విడుదల కానున్న సినిమా
బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన మలయాళ నటి హనీ రోజ్. బొద్దుగా ఉన్న హనీరోజ్ తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో మరో సినిమా చేయకున్నా.. వ్యాపార ప్రకటనలు, ఓపెనింగ్స్ లో పాల్గొన్న ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఇప్పుడు ఆమె రాచెల్ (తెలుగులో రాహేలు) అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. 

ఎవ్వరూ ఊహించని పాత్రలో హనీ రోజ్ అందరికీ షాకిచ్చింది. ఓ బీఫ్ షాపులో మాంసం కొడుతున్న లుక్‌ చూసి అంతా అవాక్కయ్యారు. మోడ్రన్ డ్రెస్సులో మాంసం కొడుతున్న ఫొటోను హనీరోజ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. పోస్టర్లను బట్టి ఇది చాలా బోల్డ్ చిత్రంలా కనిపిస్తోంది.  పాన్ ఇండియా చిత్రంగా ఇది తెలుగు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఆనందిని బాల దర్శకత్వం వహిస్తున్నారు.
.
Honey Rose
Tollywood
Balakrishna
Rachel
first look

More Telugu News