Tiger: పొలం దున్నుతున్న రైతు.. షికారు చేసిన పులి.. వీడియో ఇదిగో!

Tiger roaming around fields in UPs Philibhit
  • ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిభిత్ జిల్లాలో ఘటన
  • పొలాల్లోంచి దర్జాగా నడుచుకుంటూ వెళ్లిన పులి
  • ఎవరికీ ఎలాంటి హానీ చేయకపోవడంతో ఊపిరి పీల్చుకున్న రైతులు
ఓ రైతు ట్రాక్టర్‌తో పొలం దున్నుతుంటే.. పక్కనే ఉన్న మరో పొలంలో ఓ పెద్దపులి దర్జాగా  షికారు చేస్తూ కనిపించింది. మరోవైపున ఉన్న ఓ వ్యక్తి దీనిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిభిత్ జిల్లాలో జరిగిందీ ఘటన.

ఉదయం పొలానికొచ్చిన రైతు ట్రాక్టర్‌తో పొలం దున్నడం మొదలుపెట్టాడు. కాసేపటికే పక్కనే ఉన్న మరో పొలంలోకి వచ్చిన పులి అతడిని ఏమాత్రం పట్టించుకోకుండా దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఆవైపున మరో పొలంలోని రైతు ఈ మొత్తం ఘటనను వీడియో తీశాడు. అలా నడుచుకుంటూ ఆ పులి ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టకుండా పొలాలు దాటి వెళ్లిపోయింది.
Tiger
Uttar Pradesh
Philibhit

More Telugu News