Devara: యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ 'దేవర'

NTR Devara completes action sequences

  • ఎన్టీఆర్, కొరటాల కాంబోలో దేవర
  • గత రెండు వారాలుగా పీటర్ హెయిన్ నేతృత్వంలో ఫైట్స్ చిత్రీకరణ
  • వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్న దేవర

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఊర మాస్ చిత్రం దేవర శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గత రెండు వారాలుగా జరుగుతున్న యాక్షన్ సీక్వెన్స్ ల చిత్రీకరణ నేటితో పూర్తయింది. ఈ మేరకు చిత్రబృందం అప్ డేట్ ఇచ్చింది. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ఈ ఫైట్స్ చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ లో హీరో ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. 

కాగా, దేవర కోసం కెన్నీ బేట్స్ వంటి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ను కూడా పిలిపించారు. బేట్స్ నేతృత్వంలో పలు థ్రిల్లింగ్ సన్నివేశాలను తెరకెక్కించారు. 

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న దేవర వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2024 ఏప్రిల్ 5న దేవర రిలీజ్ కానుంది. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Devara
NTR
Koratala Siva
NTR Arts
Yuvasudha Arts
  • Loading...

More Telugu News