padmini: మా హీరో రెండున్నర కోట్లు తీసుకున్నాడు.. ప్రమోషన్స్‌కు మాత్రం రాలేదు: మలయాళ సినిమా 'పద్మిని' నిర్మాత

Padmini producer slams Kunchacko Boban for zero promotions
  • ప్రేక్షకుల ముందుకు వచ్చిన మలయాళీ చిత్రం పద్మిని
  • సినిమాను ప్రేక్షకులను ఆదరిస్తున్నారని చెప్పిన నిర్మాత
  • కానీ హీరో ప్రమోషన్స్ కు రాలేదని ఆవేదన
ప్రముఖ నటుడు కుంచకో బోబన్ కథానాయకుడిగా, సెన్నా హెగ్డే దర్శకత్వంలోని మలయాళీ చిత్రం పద్మిని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ చిత్ర నిర్మాత మాత్రం తమ హీరో ప్రమోషన్స్‌లో పాల్గొనకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు రూ.2.5 కోట్లు తీసుకున్న బోబన్.. ప్రమోట్ చేయడంలో మాత్రం ఆయన కృషి జీరో అని నిర్మాత అసంతృప్తి వ్యక్తం చేశారు.

పద్మిని నిర్మాత సువిన్ కే వర్కీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పద్మిని ప్రేక్షకులను అలరిస్తోందని, మంచి కలెక్షన్స్ వస్తున్నాయని, ఇందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కానీ ఈ సినిమాను సరిగ్గా ప్రమోషన్ చేయలేదని వస్తున్న ప్రశ్నలకు తాము సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. తన స్టార్ డమ్ ను ఉపయోగించే థియేటర్ కు ప్రేక్షకులను తీసుకువచ్చే బాధ్యత సినిమాలోని ప్రతి నటుడిపై ఉందని, కానీ మా హీరో 25 రోజుల షూటింగ్ కోసం రూ.2.5 కోట్ల పారితోషికం తీసుకొని, ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హీరో భార్య నియమించిన మార్కెటింగ్ కన్సల్టెంట్ తమ సినిమా రా ఫుటేజీని చూసి ప్రమోషన్స్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ రద్దు చేశారని, ఇలాంటి అనుభవం తనకు మాత్రమే కాదని, ఆ హీరో నటించిన మరో మూడు చిత్రాల నిర్మాతలకు కూడా ఎదురైందన్నారు. ఇలాంటి అంశంపై ఎవరో ఒకరు ముందుకు వచ్చి మాట్లాడాలని, అందుకే తాను మాట్లాడుతున్నానని చెప్పారు. సదరు హీరో నటించిన చిత్రానికి ఆయనే సహ నిర్మాతగా వ్యవహరిస్తే ఇలాంటి సమస్య రాలేదన్నారు. ప్రతి ఇంటర్వ్యూ, ప్రోగ్రామ్ లో పాల్గొని సహ నిర్మాతగా ఉన్న సినిమాను తనే ప్రమోట్ చేశారన్నారు. బయటి నిర్మాతలు అయితే మాత్రం పట్టించుకోరన్నారు. అతనికి సినిమా కంటే యూరోప్ లో స్నేహితులతో ఎంజాయ్ చేయడం ఇష్టమన్నారు.
padmini
cinema
hero
malayalam

More Telugu News