Niranjan Reddy: కేసీఆర్ వల్లే బషీర్ బాగ్ కాల్పులు జరిగాయని కొందరు సన్నాసులు మాట్లాడుతున్నారు: మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

Niranjan Reddy fires on Congress

  • యూపీఏతోనో, కాంగ్రెస్ తోనో తెలంగాణ రాలేదన్న నిరంజన్ రెడ్డి
  • 24 గంటల విద్యుత్ సరఫరాను సాధ్యం చేసి చూపించామని వ్యాఖ్య
  • కరెంట్ అంశాన్ని పట్టుకుని కాంగ్రెస్ షాక్ కు గురైందని ఎద్దేవా

కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పడం వాళ్ల అహంకారానికి నిదర్శనమని అన్నారు. యూపీఏతోనో, కాంగ్రెస్ తోనో తెలంగాణ రాలేదని చెప్పారు. తెలంగాణ ఈ రాష్ట్ర ప్రజల హక్కు అని చెప్పారు. బషీర్ బాగ్ కాల్పులు కేసీఆర్ వల్లే జరిగాయని కొందరు సన్నాసులు మాట్లాడుతున్నారని... ఆనాడు ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. 

రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరాను సాధ్యం చేసి చూపించామని నిరంజన్ రెడ్డి అన్నారు. 24 గంటలు విద్యుత్ సరఫరా కావడం లేదని కొందరు విద్యుత్ సబ్ స్టేషన్లకు వెళ్లి లాగ్ బుక్ చూపిస్తున్నారని... విద్యుత్ సరఫరా అన్న తర్వాత మధ్యమధ్యలో ఆటంకాలు ఉండవా? అని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్లలో కమిషన్లు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోందని... విద్యుత్ కొంటే కమిషన్ వస్తుందా? అని ప్రశ్నించారు. కరెంట్ అంశాన్ని పట్టుకుని కాంగ్రెస్ షాక్ కు గురైందని అన్నారు.

Niranjan Reddy
KCR
BRS
Congress
  • Loading...

More Telugu News