Pooja Bhatt: మద్రాస్ హైకోర్టులో సినీ నటి పూజాభట్ కు ఎదురుదెబ్బ

Backlash to Pooja Bhatt in Madras High Court

  • నీలగిరి జిల్లాలో ఒక ఎకరం అసైన్డ్ భూమిని కొనుగోలు చేసిన పూజాభట్
  • ఆ భూమిని కొనుగోలు చేయడం కుదరదన్న కొత్తగిరి తహసీల్దారు
  • తహసీల్దారు ఆదేశాలను సమర్థించిన మద్రాస్ హైకోర్టు

బాలీవుడ్ నటి పూజాభట్ కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివరాల్లోకి వెళ్తే, నీలగిరి జిల్లా జెగదల గ్రామంలో ఆమె అసైన్డ్ భూమిని కొనుగోలు చేశారు. ఎస్టీ తెగకు చెందిన ఎం.కుప్పన్ అనే వ్యక్తికి 1978లో అప్పటి జిల్లా కలెక్టర్ ఒక ఎకరం భూమిని కేటాయించారు. కాలక్రమంలో ఆ భూమి పలువురి చేతులు మారింది. ఇదే భూమిని పూజాభట్ కొన్నారు. అయితే ఈ భూమి కొనుగోలు చేయడం చెల్లదని... ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని గతంలో కొత్తగిరి తహసీల్దారు ఆదేశించారు. దీంతో పూజాభట్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పలు దఫాలుగా విచారణ జరిపిన హైకోర్టు జడ్జి... తహసీల్దారు ఆదేశాలను అంగీకరిస్తూ తీర్పును వెలువరించారు.

More Telugu News