Upasana: క్లీంకార కోసం ప్రత్యేక గదిని సిద్ధం చేయించిన ఉపాసన

Special Home for Klimkara

  • కూతురు క్లీంకార విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న ఉపాసన
  • ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా గదిని సిద్ధం చేయించిన వైనం
  • ప్రముఖ ఆర్కిటెక్ట్ పవిత్రతో రూమ్ డిజైన్ చేయించిన ఉపాసన

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. కూతురుకి వారు క్లీంకార అనే పేరు పెట్టుకున్నారు. మరోవైపు తన కూతురు విషయంలో ఉపాసన ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. బిడ్డ చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉండేలా గదిని సిద్ధం చేయించారు. తన పుట్టింట్లో క్లీంకార కోసం ప్రముఖ ఆర్కిటెక్ట్ పవిత్ర రాజారామ్ నేతృత్వంలో రూమ్ ను డిజైన్ చేయించారు. అమ్రాబాద్ ఫారెస్ట్, వేదిక్ హీలింగ్ స్ఫూర్తితో గదిని డిజైన్ చేయించినట్టు ఉపాసన తెలిపారు. అపోలో ఆసుపత్రిలో తన డెలివరీ రూమ్ వీడియోను కూడా ఆమె ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. లలితా సహస్రనామం నుంచి తన మనవరాలికి క్లీంకార అనే పేరు పెట్టినట్టు చిరంజీవి వెల్లడించిన సంగతి తెలిసిందే.

Upasana
Ramcharan
Klin Kaara
Speacial Room
Tollywood

More Telugu News