Officer Max: హిట్ 2 చిత్రంలోని ఆఫీసర్ 'మ్యాక్స్' ఇకలేదు!

Officer Max a dog wich played key role in HIT2 is no more

  • తన పెంపుడు శునకం చనిపోయిందని తెలిపిన దర్శకుడు శైలేష్
  • అడివి శేష్ హీరోగా నటించిన హిట్2లో కీలక పాత్ర పోషించిన శునకం
  • నానితో రానున్న హిట్3

విష్వక్సేన్, అడివి శేష్ హీరోలుగా హిట్, హిట్2 చిత్రాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు శైలేష్‌ కొలను. ఈ రెండు క్రైమ్ థ్రిల్లర్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. ముఖ్యంగా అడివి శేష్ హీరోగా హిట్‌ 2 మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన మాక్స్ (డాగ్‌) ప్రాణాలు విడిచింది. మాక్స్ తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ఈ విషయాన్ని శైలేష్ కొలను తెలిపాడు. 

‘బరువెక్కిన హృదయంతో ఈ వార్తను మీతో షేర్ చేసుకుంటున్నా. మా ప్రియమైన మాక్స్ ఇప్పుడే చనిపోయింది. మాక్స్‌ పది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. క్రూరమైన జాతి అయినప్పటికీ.. నా జీవితంలో నేను కలుసుకున్న అత్యంత సున్నితమైన మనసుల్లో ఇది ఒకటి. ఆఫీసర్ మాక్స్‌ మేమంతా నిన్ను మిస్సవుతున్నాం. మాక్స్‌ లేకుండా హిట్2 అంత బాగా వచ్చేది కాదు’ అని శైలేష్ ట్వీట్ చేశారు. హిట్ కు సీక్వెల్ గా న్యాచురల్‌ స్టార్ నానితో హిట్‌3 ఉండబోతుందని శైలేష్‌ కొలను ఇప్పటికే ప్రకటించారు.

Officer Max
HIT2
movie
sailesh kolanu
adivi shesh
  • Loading...

More Telugu News