PM Modi: ఫ్రాన్స్ నుంచి అమిత్ షాకు ఫోన్ చేసిన మోదీ

PM Calls Amit Shah From France And Enquires About Delhi Flood Like Situation

  • ఢిల్లీ వరదలపై ఆరా తీసిన ప్రధాని
  • పరిస్థితిని వివరించిన కేంద్ర హోంమంత్రి
  • ప్రజల రక్షణకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడి
  • ట్వీట్ లో వెల్లడించిన ప్రధాని కార్యాలయం 

రెండు రోజుల పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ఫోన్ చేశారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. యమునా నది వరదల నేపథ్యంలో ఢిల్లీలో పరిస్థితిపై ఆరా తీసినట్లు వెల్లడించింది. ఈమేరకు రాత్రి పీఎంవో ఓ ట్వీట్ చేసింది. మరో 24 గంటల్లో యమునా నది నీటిమట్టం తగ్గే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను మోహరించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరించారని పేర్కొంది.

వరదలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) తో కలిసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నట్లు అమిత్ షా ప్రధానికి తెలియజేసినట్లు వివరించింది. అవసరమైతే ప్రజలను వేగంగా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారని తెలిపింది.

దేశ రాజధానిలో వరదల కారణంగా గురువారం జనజీవనం అస్తవ్యస్తంగా మారిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో స్కూళ్లు, కాలేజీలకు ఈ నెల 16 వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అత్యవసర వస్తువులను రవాణా చేసే వాహనాలు మినహా భారీ వాహనాలను రాజధానిలోకి రాకుండా అధికారులు బ్యాన్ విధించారు.

  • Loading...

More Telugu News