Nara Lokesh: జగన్ ఓ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్: నారా లోకేశ్

Highlights of yuvagalam padayatra in udayagiri

  • ఉదయగిరి నియోజకవర్గంలో ఉత్సాహ భరితంగా సాగిన లోకేశ్ ‘యువగళం’
  • తమ సమస్యలపై లోకేశ్‌కు వినతి పత్రాలు సమర్పించిన వివిధ గ్రామాల ప్రజలు
  • కొండాపూర్ బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగం, జగన్‌ను తూర్పారబట్టిన యువనేత
  • 13,14 తేదీల్లో లోకేశ్ కోర్టుకు హాజరుకానుండటంతో యువగళానికి విరామం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర బుధవారం (154వ రోజు) ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో(ఎస్పీఎస్సార్ నెల్లూరు జిల్లా) ఉత్సాహంగా సాగింది. చోడవరం క్యాంప్ సైట్ నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. యువనేతను కలిసేందుకు జనం పోటెత్తారు. తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రాలు సమర్పించారు. కొండాపురం బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన లోకేశ్ జగన్ పాలనను ఎండగట్టారు. 

‘‘సింహపురిలో నేను సింహంలా అడుగుపెట్టా. అడుగుపెట్టనివ్వం అన్న వాళ్లు అడ్రస్ లేరు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశా, నన్ను నెల్లూరు ఆదరించింది... ప్రజల కష్టాలు నేరుగా చూశా, మీ కన్నీళ్లు తుడుస్తా’’ అని యువనేత నారా లోకేశ్ పేర్కొన్నారు.
లోకేశ్ ప్రసంగంలో ముఖ్యాంశాలు 
  • ఒక్క అడుగు కూడా వెయ్యనివ్వం అన్నారు...2 వేల కిలోమీటర్లు నడిచాను,  ప్రజల్ని కలవకుండా అడ్డుకుంటాం అన్నారు...154 రోజులుగా ప్రజల్లోనే ఉన్నా. మాట్లాడనివ్వం అన్నారు..యువగళం దెబ్బకి ప్యాలస్ పిల్లి షేక్ అయ్యింది. జగన్ ది పోలీసు బలం.. నాది ప్రజాబలం.
  • శ్రీ కృష్ణ దేవరాయలు పాలించిన గడ్డ ఉదయగిరి. ఉదయగిరి కోటకి ఎంత పౌరుషం ఉందో ఇక్కడి ప్రజలకు అంత పౌరుషం ఉంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఉదయగిరి నేలపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.  
  • మధ్యప్రదేశ్ లో ఒక గిరిజనుడిపై ఒక దుర్మార్గుడు ఉచ్చ పోసి బూతులు తిడుతూ అవమానించాడు. వెంటనే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నిందితుడిని అరెస్ట్ చేయించి అతడు ఆక్రమించుకొని కట్టిన ఇల్లు కూడా కూల్చారు. ఆంధ్రప్రదేశ్ లో సైకో సీఎం ఏమి చేశాడు? దళిత యువకుడు సుబ్రమణ్యంని చంపేసిన అనంతబాబుపై చర్యలు తీసుకోలేదు. పైగా బెయిల్ రావడానికి సహకరించారు. ఇప్పుడు ఏకంగా అనంతబాబుకి సన్మానాలు, ఊరేగింపులు చేస్తున్నారు. 
  • జగన్ ఒక కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయన ఒక బటన్ నొక్కగానే రూ.10 అకౌంట్‌లో పడుతుంది. ఇంకో బటన్ నొక్కగానే విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ బస్ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇలా రకరకాల పన్నుల పేరిట రూ.100 కట్ అవుతుంది.  
  • 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్. జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేశాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 
  • భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. 2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూశాను...కన్నీళ్లు తుడుస్తాను. 
  • జగన్ యువత భవిష్యత్తుపై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సీ లేదు. 
  • జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టీడీపీ మీకు అండగా ఉంటుంది. 
  • బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూశాను. సైకోపాలనలో బీసీలపై 26 వేల అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. 
  • 15 ఏళ్ల పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే సీఎం స్పందించలేదు. అమర్నాధ్ గౌడ్ చేసిన తప్పేంటి? తన అక్కని వేధిస్తున్న వైసీపీ కార్యకర్త వెంకటేశ్వరరెడ్డిని అడ్డుకున్నాడు. బీసీలు అంటే జగన్ కి చిన్నచూపు. 
  • డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూశారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసీపీ నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం.
  • జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేశాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసింది టీడీపీ మాత్రమే.
  • నెల్లూరు జిల్లాను ఎంతో అభివృద్ధి చేశాం. 1.30లక్షల ఎకరాలకు సాగునీరిచ్చాం 32వేలమంది యువతకు ఉద్యోగాలిచ్చాం ఆక్వారంగాన్ని ఆదుకుంటాం!
  • ప్యాలస్ బ్రోకర్ సజ్జల కన్ను ఉదయగిరి నియోజకవర్గం మీద పడింది. అందుకే కుట్ర చేసి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని బయటకి పంపాడు. ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న దాదాపు 3 వేల ఎకరాల ప్రభుత్వ భూములు కాజేసేందుకు భారీ స్కెచ్ వేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన భూ అక్రమాలపై సిట్ వేస్తాం.
  • ఉదయగిరి టౌన్ లో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ బాలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉదయగిరిని మోడల్ టౌన్ గా అభివృద్ధి చేస్తాం. 
యువనేత నారా లోకేశ్‌తో వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారు. వారిచ్చిన వినతి పత్రాలను పరిశీలించిన నారా లోకేశ్ టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

కాగా, వైసీపీ ఫేక్ ప్రాప‌గాండాపై న్యాయ‌పోరాటం చేస్తున్న లోకేశ్.. కోర్టు కేసుల నిమిత్తం తేదీల్లో మంగళగిరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో యువగళానికి రెండు రోజుల పాటు విరామం ప్రకటించారు. 

యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు
  • ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం –2039.4 కి.మీ
  • ఈరోజు నడిచిన దూరం –19.5కి.మీ.

13,14 తేదీల్లో యువగళానికి విరామం
15వతేదీన (155వరోజు) పాదయాత్ర ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం శివారు క్యాంప్ సైట్ నుంచి యథావిధిగా ప్రారంభమవుతుంది.

Nara Lokesh
Yuva Galam Padayatra
Udayagiri
TDP
Nellore District
  • Loading...

More Telugu News