Kavya Kalyan Ram: అదంతా పుకారు మాత్రమే: హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్

Kavya kalyan Ram Special

  • చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైన కావ్య కల్యాణ్ రామ్ 
  • హీరోయిన్ గాను పుంజుకుంటున్న కెరియర్ 
  • బాడీ షేమింగ్ గురించి ప్రస్తావించిందని టాక్ 
  • అదంతా పుకారు మాత్రమేనని చెప్పిన కావ్య    


చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరకి పరిచయమై .. ఆ తరువాత హీరోయిన్ గాను ఎంట్రీ ఇచ్చిన కథానాయికలు కొంతమందే కనిపిస్తారు. అలాంటి కథానాయికలలో కావ్య కల్యాణ్ రామ్ ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా తను 'గంగోత్రి' .. 'ఠాగూర్' .. 'అడవిరాముడు' మొదలైన సినిమాలలో నటించి మెప్పించింది. 

ఆ తరువాత ఈ మధ్యనే కథానాయికగా 'మాసూద' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే 'మసూద' సినిమా హారర్ థ్రిల్లర్ కావడంతో, కావ్య పాత్రను గురించి ఎవరూ కూడా అంతగా పట్టించుకోలేదు. ఆ తరువాత వచ్చిన 'బలగం' సినిమా మాత్రం ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

బాడీ షేమింగ్ విషయంలో కొంతమంది డైరెక్టర్స్ ధోరణి తనని చాలా బాధపెట్టిందని కావ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా రీసెంటుగా ఒక పుకారు షికారు చేయడం మొదలుపెట్టింది. అందుకు ఆమె స్పందిస్తూ .. తన విషయంలో ఏ డైరెక్టరూ ఎప్పుడూ అలా మాట్లాడలేదనీ, అసలు ఆ విషయాన్ని గురించి తాను ఎక్కడా ప్రస్తావించలేదని కావ్య చెప్పుకొచ్చింది. ఇలాంటి అనవసరమైన ప్రచారాలు మానుకోవడం మంచిదంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చింది.

More Telugu News